వేసవిలో ప్రభుత్వ పని గంటలను తగ్గించిన కువైట్..!!

- May 22, 2026 , by Maagulf
వేసవిలో ప్రభుత్వ పని గంటలను తగ్గించిన కువైట్..!!

కువైట్: సమ్మర్ సీజన్ నేపథ్యంలో కువైట్లోని ప్రభుత్వ ఏజెన్సీలకు వర్కింగ్ అవర్స్ ను తగ్గించారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అధికారిక పని గంటలు ఒక గంట తగ్గించారు. దీనితో మొత్తం రోజువారీ పని గంటలు ఆరు గంటలకు చేరాయి. 

ఫ్లెక్సిబుల్ పని గంటల వ్యవస్థను అమలు చేస్తున్న ఏజెన్సీలలో, ఉద్యోగులు ఉదయం 7:00 నుండి 8:00 గంటల మధ్య పనికి హాజరు కావడానికి అనుమతిస్తారు. వారు వచ్చిన సమయం ఆధారంగా ఆరు గంటల పనిని పూర్తి చేయాలి. ఉదయం పని గంటల వ్యవస్థలోని మిగిలిన అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.

పని గంటల తగ్గింపు చట్టబద్ధంగా అమలులో ఉన్న షిఫ్ట్ ఆధారిత వ్యవస్థలను ప్రభావితం చేయదని సివిల్ సర్వీస్ కౌన్సిల్ (CSB) స్పష్టం చేసింది.  

ఇక సాయంత్రం షిఫ్టులు సాయంత్రం 5:00 గంటలకు ముందు ప్రారంభం కాకూడదని కూడా ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు షిఫ్ట్ ప్రారంభంలో 30 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను పొందుతూనే ఉంటారు. అలాగే సాయంత్రం పని షెడ్యూళ్లకు సంబంధించిన అన్ని ఇతర నిబంధనలు కొనసాగుతాయి. ఈ కొత్త వేసవి పని గంటల వ్యవస్థ జూన్ 1నుండి ఆగస్టు 31వరకు అమల్లో ఉంటుంది.  ఆ తర్వాత సాధారణ ఉదయం మరియు మహిళల షిఫ్ట్ షెడ్యూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com