2.4% మేర పెరిగిన సౌదీ నిర్మాణ కాస్ట్ ఇండెక్స్..!!
- May 22, 2026
రియాద్: ఏప్రిల్ 2026లో సౌదీ అరేబియాలో నిర్మాణ వ్యయ సూచిక (Construction Cost Index) 2.4 శాతం మేర పెరిగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) నివేదిక తెలిపింది. నివాస రంగ నిర్మాణ వ్యయాలు 2.4 శాతం, నివాసేతర రంగ వ్యయాలు 2.7 శాతం పెరగడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొంది.
ఇక నివాస రంగ సూచిక గత ఏడాదితో పోలిస్తే 2.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీనికి పరికరాలు మరియు యంత్రాల అద్దె వ్యయాలు 4.7 శాతం పెరగడమే దీనికి ముఖ్య కారణంగా తెలిపింది.
ఏప్రిల్ 2025తో పోలిస్తే, ఆపరేటర్‌తో కూడిన పరికరాలు మరియు యంత్రాల అద్దె వ్యయాలు 6.3 శాతం, కార్మిక వ్యయాలు 2.8 శాతం, అలాగే ఇంధన ధరలు 3 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. అలాగే, ప్లాస్టిక్ మరియు గాజు ఉత్పత్తుల ధరలు 2.1 శాతం పెరగడం వల్ల ప్రాథమిక నిర్మాణ సామాగ్రి వ్యయాలు కూడా 1.2 శాతం మేర పెరిగాయని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







