వేసవిలో ప్రభుత్వ పని గంటలను తగ్గించిన కువైట్..!!
- May 22, 2026
కువైట్: సమ్మర్ సీజన్ నేపథ్యంలో కువైట్‌లోని ప్రభుత్వ ఏజెన్సీలకు వర్కింగ్ అవర్స్ ను తగ్గించారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అధికారిక పని గంటలు ఒక గంట తగ్గించారు. దీనితో మొత్తం రోజువారీ పని గంటలు ఆరు గంటలకు చేరాయి.
ఫ్లెక్సిబుల్ పని గంటల వ్యవస్థను అమలు చేస్తున్న ఏజెన్సీలలో, ఉద్యోగులు ఉదయం 7:00 నుండి 8:00 గంటల మధ్య పనికి హాజరు కావడానికి అనుమతిస్తారు. వారు వచ్చిన సమయం ఆధారంగా ఆరు గంటల పనిని పూర్తి చేయాలి. ఉదయం పని గంటల వ్యవస్థలోని మిగిలిన అన్ని నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.
పని గంటల తగ్గింపు చట్టబద్ధంగా అమలులో ఉన్న షిఫ్ట్ ఆధారిత వ్యవస్థలను ప్రభావితం చేయదని సివిల్ సర్వీస్ కౌన్సిల్ (CSB) స్పష్టం చేసింది.
ఇక సాయంత్రం షిఫ్టులు సాయంత్రం 5:00 గంటలకు ముందు ప్రారంభం కాకూడదని కూడా ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ వ్యవస్థ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు షిఫ్ట్ ప్రారంభంలో 30 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను పొందుతూనే ఉంటారు. అలాగే సాయంత్రం పని షెడ్యూళ్లకు సంబంధించిన అన్ని ఇతర నిబంధనలు కొనసాగుతాయి. ఈ కొత్త వేసవి పని గంటల వ్యవస్థ జూన్ 1నుండి ఆగస్టు 31వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ఉదయం మరియు మహిళల షిఫ్ట్ షెడ్యూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







