స్విమ్మింగ్ పూల్ ప్రమాదాల తగ్గింపునకు గైడ్ లైన్స్ జారీ..!!

- May 22, 2026 , by Maagulf
స్విమ్మింగ్ పూల్ ప్రమాదాల తగ్గింపునకు గైడ్ లైన్స్ జారీ..!!

దోహా: స్విమ్మింగ్ పూల్ ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులను మరియు సంరక్షకులను కోరింది. పూల్ ప్రాంతంలో లేదా దాని చుట్టూ పిల్లలు పరుగెత్తకుండ చూడాలని మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. పిల్లలను అన్ని వేళలా నిశితంగా గమనిస్తూ ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా, స్మిమ్మర్స్ పూల్ ప్రాంతం వెలుపల నడిచే ముందు తమ పాదాలను ఆరబెట్టుకోవాలన్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో స్విమ్మింగ్ పూల్ ప్రమాదాలను నివారించవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com