ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- May 22, 2026
దోహా: ఖతార్ లో ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్ల సంఖ్య 8500 దాటింది. "ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్ల సామాజిక బాధ్యత" (Community Responsibility of Private Schools and Kindergartens) అనే చొరవ కింద ఈ సీట్లు అందుబాటులో ఉన్నాయని విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్‌లోని అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన విద్యను గా అందించేందుకు ఈ స్కీమ్ దోహదం చేస్తుందన్నారు.
అందుబాటులో ఉన్న సీట్ల కోసం ఇప్పటివరకు సుమారు 17,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. అందుబాటు ఫీజులలో నాణ్యమైన విద్యను పొందాలని ఆశిస్తున్న కుటుంబాల నుండి డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్రైవేట్ స్కూల్స్, కిండర్గార్టెన్ల విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలియజేశారు.
పూర్తిగా ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబాల వాస్తవ నెలవారీ ఆదాయం QR10,000 మించకూడదని, అయితే నెలకు QR15,000 వరకు సంపాదించే కుటుంబాలకు రాయితీ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యా వోచర్ విలువ కలిగిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబం ఆదాయం QR25,000 మించకూడదని అన్నారు. అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఒక ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







