రాష్ట్రమంతటా మొక్కలు నాటాలి - మంత్రి జూపల్లి కృష్ణారావు
- August 08, 2016
Ø రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీరాజ్ రోడ్ల వెంట మొక్కలు నాటాలి.
Ø వారం పదిరోజుల్లోనే టార్గెట్ అధిగమించాలి
Ø ఇప్పటికే 9000 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటడం పూర్తయింది
Ø మిగిలిన 7800 కి.మీ పొడవునా నెలాఖరులోగా మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
Ø వీలైన చోట్ల పుష్కర ఘాట్ల వద్ద మొక్కలు నాటేందుకు ప్లాన్ చేయాలి
Ø నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ప్రజలందరి భాగస్వామ్యంతో హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాష్ట్రంలో ని 16వేల 800 కి.మీల పంచాయతీరాజ్ రోడ్ల పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నెలాఖరులోగాపూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ నుంచి కమిషనర్ అనితారామచంద్రన్, సెర్ప్ సీఈఓ పౌసమీబసు లతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన 42 కోట్ల టార్గెట్ ను అధిగమించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో వేలాది మొక్కలు నాటుతుంటే... మరికొన్ని గ్రామాల్లో కార్యక్రమం ఆశాజనకంగా సాగటంలేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధిహామీ, సెర్ప్ సిబ్బందికి 30 శాతం వేతనాలను ఇటీవలే పెంచామని... వారి సేవలను పూర్తి స్థాయిలో హరితహారంలో వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ నర్సరీలనుండి కొనుగోలు చేయాలన్నారు. ఈ నెల 10 న 2000 కి.మీ పొడవునా పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలోను కనీసం 40 వేల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.


తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







