తెలుగు ప్రవాసులకు 'APNRT' వారి గొప్ప ఆఫర్
- August 08, 2016
కృష్ణ పుష్కరాల నేపధ్యంలో మాగల్ఫ్.కామ్, APNRT CEO వేమూరి రవి కుమార్ గారిని కలిసి, పుష్కారాల సందర్భంగా ఎన్నారైలకి ఉన్న సదుపాయాలూ, వారు సమర్పించవలసిన డాక్యుమెంట్స్ గురించి చర్చించింది.ఈ సందర్భంగా వేమూరు రవి కుమార్ గారు మాట్లాడుతూ ..
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరిని సమీకృతం చేసే వేదిక అని APNRT CEO వేమూరి రవికుమార్ అన్నారు. ఎన్నారైలకు అవసరమయిన అన్ని ఎన్నో సేవలు ఒకే గొడుగు కింద పొందేందుకు వీలుగా NRTరూపకల్పన జరిగింది. అంతే కాక ఎప్ అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వామ్యం చెయ్యాలన్న యోచన కూడా ఉందని రావికూమార్ తెలియజేసారు. ప్రముఖ దేవాలయాల సందర్శనకు రిజర్వేషన్, ఒసిఐ/ప్యాన్/అదార్ పొందేందుకు సహకారం, పెట్టుబడి సలహాలు, న్యాయ సహకారం, ట్యాక్సేషన్ సూచనలు బ్యాంకింగ్ సలహాలు పొందే అవకాశం ఉంది. APNRT సైట్ ద్వారా సొంత గ్రామాలకు విరాళాలు అందించే వీలు కూడా ఉందని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కో అర్దినేటర్స్ నియామకం జరుగుతుంది. ప్రవాసులకు ప్రత్యేక సదుపాయాలూ ఏర్పాటు చేస్తున్నామని త్వరలో వాటిని పలు పత్రికలలో మరియు మాగల్ఫ్.కామ్ ద్వారా ప్రవాసులందరికి చేరుస్తామని తెలిపారు.అంతే కాకుండా ఎప్పటికప్పుడు పుష్కారాలకి సంబంధించి ప్రవాసులకు చేస్తున్న సదుపాయాలన్నీ అందరికి చేరేలా ప్రచారం చేయమని APNRT CEO వేమూరి రవి కుమార్ ప్రవాసులకి ఈ విధంగా తెలిపారు.
ఈ సందర్భంగా మాగల్ఫ్.కామ్ కృష్ణా పుష్కరాలకి గాను ప్రవాసులకోసం APNRT CEO వేమూరి రవి కుమార్ గారు చేస్తున్న కృషి కి అభినందిస్తూ వారి సహాయానికి ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







