పుష్కరాల తరువాత మంత్రివర్గంలోకి లోకేష్
- August 08, 2016
నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తపిస్తోన్న టిడిపి నేతలకు శుభవార్త. అతిత్వరలోనే చినబాబు ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగబోతోందని సమాచారం. దీనిలో లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నేతలను కూడా మంత్రిపదవులు వరించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అన్న విషయమై అటు ఇటుగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలు చూస్తూవచ్చిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారన్నమాట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







