ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- May 24, 2026
జెడ్డా: మిడిలీస్టులోని తాజా పరిణామాలపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పలువురు అరబ్ నాయకులతో కలిసి ఒక జాయింట్ ఫోన్ కాల్ మీటింగ్ లో పాల్గొని చర్చలు జరిపారు.
ఈ గ్రూప్ కాల్ లో బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలను సమీక్షించారు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి నిరంతర సంప్రదింపులు, సమన్వయ ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఉద్రిక్తతలను నివారించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించే విస్తృత ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఖతార్ చేపట్టిన దౌత్యపరమైన కార్యక్రమాలతో పాటు పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై కూడా వారు చర్చించారు. నెలల తరబడి కొనసాగుతున్న మిడిలీస్టు సంఘర్షణను ముగించే ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్న తరుణంలో ఈ సంయుక్త సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







