ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- May 25, 2026
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం లోక్ భవన్‌లో 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలతో అనుసంధానమై బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సుపరిపాలన సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని ట్రైనీ అధికారులకు సూచించారు. సేవాభావంతో పని చేస్తేనే మంచి పరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
శిక్షణలో ఉన్న ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డా. కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







