ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- May 25, 2026
ఫుజైరా: ఈద్ అల్ అధా పర్వదినాన్ని పురస్కరించుకుని ఫుజైరా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిజ్ హైనెస్ షేక్ హమద్ బిన్ మహమ్మద్ అల్ షర్కీ 104 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఫుజైరాలోని శిక్షా, సంస్కరణ కేంద్రాల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
వివిధ దేశాలకు చెందిన ఈ ఖైదీలను వారి మంచి ప్రవర్తన, క్రమశిక్షణ ఆధారంగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ బిన్ ఘనిమ్ అల్ కాబీ ఈ సందర్భంగా షేక్ హమద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన ఖైదీలు సమాజంలో సానుకూల పాత్ర పోషిస్తూ మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







