సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- May 28, 2026
హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన “మీ సురక్ష” అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ మాట్లాడుతూ “మీ సురక్ష” యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానాన్ని వివరించారు.
అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించగా, హాజరైన ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







