సూసైడ్ నోట్‌లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- July 14, 2026
తెలంగాణ: తెలంగాణను కుదిపేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్యల కేసులో విషాదాంత ముగింపు చోటుచేసుకుంది. కన్నబిడ్డలను సైతం వదలకుండా ఆరుగురిని గొంతుకోసి చంపిన ఉన్మాది బి. రాజ్‌కుమార్ (35) ఉదంతం అతడి ఆత్మహత్యతో ముగిసింది. శనివారం నుంచి తప్పించుకు తిరుగుతున్న రాజ్‌కుమార్.. కొత్తూరు మండలం పంజరాల సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం.. నిందితుడి అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ముగిశాయి.
రాజ్‌కుమార్ చేసిన దారుణమైన పనికి బంధువులు, గ్రాస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే అతని భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరూ ముందుకు రాలేదు. చేవెళ్ల మార్చురీలో ఉన్న రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసేందుకు అతని తల్లిదండ్రులను, సోదరుడిని పోలీసులు తీసుకెళ్లారు. శవాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవగా.. సోదరుడు మాత్రం శవాన్ని చూసేందుకు నిరాకరించాడు. “వాడి వల్ల మా కుటుంబ పరువు గంగలో కలిసిపోయింది.. నేను వాడి మొఖం కూడా చూడను” అంటూ అక్కడి నుంచి వెనుదిరిగాడు. చివరకు అధికారుల సమక్షంలో చేవెళ్ల మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలోనే రాజ్‌కుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందే చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
Shabad Murder Case: సూసైడ్ నోట్‌లో బిగ్ ట్విస్ట్.. 4 పేజీల లేఖ లభ్యం
రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో పోలీసులకు ఒక బాండ్ పేపర్, నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమయ్యాయి. ఈ లేఖ ద్వారా కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది.”నా చావుకు నలుగురు వ్యక్తులు కారణం” అంటూ రాజ్‌కుమార్ ఆ లేఖలో వారి పేర్లను ప్రస్తావించాడు. గతంలో తనపై పెట్టిన పోక్సో (POCSO) కేసును ఉపసంహరించుకోవడానికి ఆ నలుగురు తనను తీవ్రంగా వేధించారని, రాజీపడటానికి ఏకంగా రూ. 50 లక్షల నగదు డిమాండ్ చేశారని లేఖలో పేర్కొన్నాడు. అంత పెద్ద మొత్తం ఇస్తేనే కేసు వెనక్కి తీసుకుంటామని, లేదంటే జైల్లోనే జీవితాంతం కుళ్లిపోయేలా చేస్తామని బెదిరించడం వల్లే తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 4 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోక్సో కేసుపై కక్ష పెంచుకుని జూలై 10 అర్ధరాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన స్వంత భార్య, ఇద్దరు పసిపిల్లలను కిరాతకంగా చంపిన రాజ్‌కుమార్.. చివరకు కొత్తూరు మండలం పంజర్లలో విషం తాగి తనువు చాలించాడు. ఈ కేసులో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు తదుపరి కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







