బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- July 14, 2026
మనామా: బహ్రెయిన్‌లో అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగడంతో దేశవ్యాప్తంగా అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) అధికారికంగా ప్రకటించింది.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (X) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, దేశంలోని పౌరులు, నివాసితులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమకు సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని కోరింది.
అలాగే పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ సమాచార మార్గాలను మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల ఆధారంగానే స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సైరన్లు మోగడానికి గల కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పరిస్థితిని సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవసరమైన సూచనలు అధికారికంగా అందజేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







