తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!

- May 28, 2026 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే వివిధ రకాల ఆడ్వాన్స్ రుణాల విషయంలో తెలంగాణ సర్కార్ సర్కార్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. హౌసింగ్ అడ్వాన్స్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన అమలు కానున్నాయి. హెచ్ఎండిఎ, తెలంగాణ హౌసింగ్ బోర్డు, సహకార గృహ నిర్మాణ సొసైటీల ద్వారా ఇళ్లు లేదా ప్లాట్లు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ ఆడ్వాన్స్ రుణాలు మంజూరు చేయకూడదని ఆర్థిక శాఖ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును మరింత జాగ్రత్తగా వినియోగించటం, బడ్జెట్ నియంత్రణల లక్ష్యంగా పటిష్ట నిబంధనలు అమలుకానున్నాయి. ఈ ఉత్తర్వులు ప్రస్తుత 2026-27 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ కోసం వివిధ కేటగిరీల ఆడ్వాన్స్ రుణాల నిధులను విడుదల చేస్తూ జారీ చేయబడ్డాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఇళ్లు కొనుగోలు చేస్తే మాత్రమే హౌసింగ్ అడ్వాన్స్ పొందవచ్చు.

గృహ అడ్వాన్స్ రుణాల రూల్స్ ఇవే ప్రభుత్వ సంస్థల ఆస్తులపై ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. గృహ అడ్వాన్స్ రుణాల కోసం తొలి త్రైమాసికానికి ఇప్పటికే రూ.50 కోట్లు విడుదల చేయబడ్డాయి. నిధుల పంపిణీలో రూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జిల్లా, ప్రాంతీయ కార్యాలయాల ఉద్యోగుల కోసం కేటాయించిన నిధులను సచివాలయం లేదా హెడ్ ఆఫీసు సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించరాదు. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులకు అడ్వాన్స్ మంజూరు చేసేటప్పుడు వారి ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించాలి. అడ్వాన్స్ ఇచ్చే విషయంలో అడుగడుగునా పరిశీలన ఇంటి నిర్మాణం, మరమ్మత్తులకు అవసరమైన మొత్తంలో అడ్వాన్స్ తప్ప మిగిలిన భాగాన్ని ఉద్యోగి స్వయంగా ఏర్పాటు చేసుకోగల సామర్థ్యం ఉందా లేదా అని చెక్ చేసి మాత్రమే అనుమతి ఇవ్వనుంది. రుణాల రికవరీ విషయంలో కూడా కఠిన నిబంధనలు విధించింది.

మంజూరైన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ఉద్యోగి వేతనం నుంచి తిరిగి వసూలు చేయడం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బాధ్యతగా పేర్కొంది. ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించేలా కూడా నిర్ణయాలు ఇంటి రుణాలతో పాటు ఇతర అవసరాలకు కూడా నిధులు కేటాయించింది. కొత్త కార్ల కొనుగోలుకు రూ.12.50 కోట్లు, ద్విచక్ర వాహనాలకు రూ.2.50 కోట్లు, కంప్యూటర్ల కొనుగోలుకు రూ.50 లక్షలు విడుదల చేసింది. పిల్లల ఉన్నత విద్య, అత్యవసర ఖర్చుల కోసం రూ.2 కోట్లు కేటాయించింది. విద్యా రుణాల రికవరీని గతంలో 8 నుంచి 10 నెలలకు పెంచడం ద్వారా ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించే చర్య తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు బదులుగా ప్రైవేట్ ఆప్షన్లకు ప్రాధాన్యత ఇచ్చి వాటినే పరిశీలించాలి. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించడం, అనవసరమైన ఖర్చులను నియంత్రించడం, ఆర్హులైన ఉద్యోగులకు మాత్రమే సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పని చేస్తాయి. ఈ చర్యలు దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com