కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- May 28, 2026
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఉదయం పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం ‘కావేరి’లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు (Breakfast Meeting) వేదికగా ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత అధికార మార్పిడి ఉత్కంఠకు ఈ ప్రకటనతో తెరపడింది.
కాంగ్రెస్ అధిష్టానం (హైకమాండ్) సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య తన సహచర మంత్రులకు స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన మూడేళ్ల పాలనలో సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ రాంచంద్ గెహ్లాట్ కార్యాలయానికి పంపించారు. ప్రస్తుతం గవర్నర్ ఇండోర్ పర్యటనలో ఉన్నప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే రాజీనామా ప్రక్రియ ముగిసింది. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు 100% ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, సిద్ధరామయ్య వర్గం సీనియర్ దళిత నాయకుడు, హోం మంత్రి జి. పరమేశ్వర పేరును కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) సమావేశంలో కొత్త సీఎం ఎవరనేది అధికారికంగా ఖరారు కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







