న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- May 28, 2026
శివరాజ్ సింగ్ చౌహాన్ రచనకు విశేష స్పందన
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ‘అప్నాపన్’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ,ఏపీ మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ‘అప్నాపన్’ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని మాత్రమే కాకుండా, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ లక్షణాలు, పరిపాలన, మహిళా సాధికారత మరియు దేశసేవ వంటి కీలక అంశాలపై లోతైన అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ జీవిత అనుభవాలు, ప్రజాసేవ పట్ల ఆయన దృక్పథం ఈ పుస్తకంలో ప్రతిబింబించాయని తెలిపారు. ముఖ్యంగా దేశాభివృద్ధి, రైతు సంక్షేమం మరియు సేవా భావం పట్ల ఆయన ఆలోచనలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు అభిమానులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







