కొత్త రూల్స్ తీసుకువచ్చిన BCCI
- May 29, 2026
ముంబై: ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేడు (శుక్రవారం మే29) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా మే 31న ఆదివారం ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 సీజన్ పూర్తి కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అత్యాధునిక కమ్యూనికేషన్ డివైజ్‌ల వినియోగం పెరుగుతుండడంతో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మైదానంలో స్మార్ట్ గ్లాసెస్, సన్‌గ్లాసెస్ తరహా గ్యాడ్జెట్‌లను వాడొద్దని ఆదేశించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వీటి వల్ల లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు మెసేజ్‌లు చేసుకునే వెలుసుబాటు ఉండటమే కారణం అని చెప్పింది.
ఇక మైదానంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ స్మార్ట్ సన్‌గ్లాసెస్ కూడా డిపాజిట్ చేయాలని బోర్డు కోరింది. ఇలా చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘మ్యాచ్ రోజులలో మైదానంలోకి ప్రవేశించేటప్పుడు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు అటువంటి పరికరాలను సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశిస్తున్నాం.’ అని బోర్డు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







