ఒమన్‌లో 47.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..!!

- May 29, 2026 , by Maagulf
ఒమన్‌లో 47.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. పలు విలాయత్‌లలో అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు అవుతున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం, 24 గంటల వ్యవధిలో అల్ రుస్తాఖ్‌లో అత్యధికంగా 47.5°C ఉష్ణోగ్రత నమోదైంది.

ఇతర ప్రాంతాలలో కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫాహుద్‌లో 47.2°C, దామా వా అల్ తాయీన్‌లో 47.0°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ అమెరాత్ మరియు అస్ సునైనా రెండింటిలోనూ 46.9°C ఉష్ణోగ్రత నమోదు కాగా, బిద్బిద్ మరియు బిదియాలో 46.7°C నమోదైంది. తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్న ఇతర ప్రాంతాలలో అల్ ఖాబిల్ మరియు సమైల్‌లో 46.6°C, అలాగే అల్ అవబి మరియు సహమ్‌లలో 46.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వేసవి తీవ్రత అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తరచూ ద్రవాలను తీసుకొని హైడ్రెడ్ గా ఉండాలని పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com