సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- May 29, 2026
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రిటైల్ రంగానికి కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విస్తరించాలని ఆర్బీఐ యోచిస్తోంది. దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విరివిగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయనున్నారు.
గుజరాత్, పుదుచ్చేరిలలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
2025-26 ఆర్థిక సంవత్సరాల్లో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నగదు బదిలీ (DBT) పథకాల కింద డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందించే ఆహార సబ్సిడీలను ఈ సీబీడీసీ ద్వారానే విజయవంతంగా అందజేశారు.
RBI: దుర్వినియోగానికి చెక్.. దారి మళ్లని నిధులు
ఈ డిజిటల్ కరెన్సీ విధానం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో జమ చేసిన నిధులను కేవలం రేషన్ షాపులు, లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన నిర్దేశిత వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా పరిమితులు విధించారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది భాగస్వాములను ఇందులో చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







