దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!

- May 29, 2026 , by Maagulf
దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!

మనామా: క్షిపణులు మరియు డ్రోన్‌లను ఉపయోగించి కువైట్ పై ఇరాన్ జరిపిన హేయమైన దాడిని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. కువైట్ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని, అలాగే సత్సంబంధాల సూత్రాలను మరియు అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఈ మేరకు కువైట్‌కు తమ పూర్తి సంఘీభావం తెలిపింది.

కువైట్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరాన్ దురాక్రమణను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న కువైట్ సాయుధ దళాల సంసిద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com