23 భవనాల కూల్చివేతకు మినిస్ట్రీ నిర్ణయం
- August 09, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఎంఎంఇ) 31 నిర్ణయాలను వెల్లడించింది. ఇందులో పాత భవనాల్ని కూల్చివేయడం, అలాగే కొన్నిటిని మెయిన్‌టెయిన్ చెయ్యడం వంటివి మూడు నెలల్లో చేయాల్సిందిగా ఈ నిర్ణయాల్లో పేర్కొన్నారు. ఇందులో 23 కూల్చివేతలకు సంబంధించిన నిర్ణయాలు ఉండగా, ఎనిమిది భవనాల నిర్వహణ సంబంధిత నిర్ణయాలున్నాయి. ఈ నెల ఇప్పటివరకు 12 నిర్ణయాలను వెల్లడించారు. 10 నిర్ణయాల్ని జులైలో వెల్లడించారు. తొమ్మిదింటిని జూన్‌లో విడుదల చేశారు. కూల్చివేత మరియు నిర్వహణ కమిటీ సూచన మేరకు మినిస్ట్రీ ఈ నిర్ణయాల్ని తీసుకుంది. ప్యానల్ జూన్ 19, 2006న తన ఆపరేషన్స్ ప్రారంభించింది. ఇప్పటిదాకా 296 నిర్ణయాల్ని ఈ చట్టం కింద విడుదల చేశారు. ఇందులో 232 నిర్ణయాలు కూల్చివేతలకు సంబంధించి, 64 నిర్ణయాలు భవన నిర్మాణాలకు సంబంధించి ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







