కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు

- May 29, 2026 , by Maagulf
కువైట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు

కువైట్ సిటీ: ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ విధానంలో జూమ్ వేదికగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కువైట్‌కు చెందిన పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫర్వానియా ప్రాంతంలోని ద్వైహి ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో, మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో మాలేపాటి సురేష్ బాబు నాయుడు, బిల్లా రమేష్ యాదవ్, రషీదా బేగం, పోలారపు బాబు నాయుడు, వెంకట సుబ్బయ్య, రాపాక రాజేష్, శిద్దా అంజనమ్మ, లాస్య రాజు, ఆషిష్ రాహుల్, శివ గాధిరాజు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ తరఫున జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ బాబు, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్, దండు చంద్రశేఖర్, కో-కన్వీనర్లు ఆలి షేక్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజాసేవా దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా కార్యక్రమాలను గుర్తు చేశారు.

అలాగే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నారా లోకేష్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న కృషిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారాన్ని సుధాకరరావు ప్రశంసించారు.

కార్యక్రమం చివరలో ఎన్టీఆర్ 104వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com