బహ్రెయిన్ లో దోమల నివారణ.. ప్రజలకు కీలక పిలుపు..!!

- May 30, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో దోమల నివారణ.. ప్రజలకు కీలక పిలుపు..!!

మనామా: బహ్రెయిన్ వ్యాప్తంగా దోమల పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దోమల సంతానోత్పత్తి కేంద్రాలను నిర్విర్యం చేసేందుకు ప్రజల నుండి సమాచారం కోరింది. ముఖ్యంగా నిర్మాణ మరియు మురుగునీటి పారుదల ప్రదేశాల సమీపంలో నిలిచి ఉన్న సమస్యాత్మక ప్రాంతాల వివరాలను 80008188 ద్వారా తెలియజేయాలని అధికారులు కోరారు.

వర్షాలు, సాధారణ ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ ఉన్న సమయాల్లో దోమల కార్యకలాపాలు సాధారణంగా పెరుగుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టైర్లు మరియు మురుగు కాలువల నుండి నిలిచి ఉన్న నీటిని తొలగించాలని ప్రజలను కోరింది.

ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించిన ఇటీవలి “హయాకోమ్” సమావేశంలో సుప్రీం కౌన్సిల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన ఇంజనీర్ మహమ్మద్ అమాన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు పౌరులే కళ్ళు అని అన్నారు. సమస్య మూల కారణాలను పరిష్కరించడానికి పటిష్టమైన పారిశుధ్య పద్ధతులు మరియు సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, అనేక ప్రాంతాల్లోని నివాసితులు స్థానికంగా దోమలు వృద్ధి చెందుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇళ్ల లోపల నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ దోమల సమస్య కొనసాగుతోందని నివాసితులు ఫిర్యాదులు చేస్తున్నారు.   

మరోవైపు బహ్రెయిన్ దేశవ్యాప్తంగా దోమల నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కలిసి అన్ని గవర్నరేట్‌లలో తమ సంయుక్త కార్యకలాపాలను చేపడుతున్నాయి.  ఇటీవల బహిరంగ ప్రదేశాలలో పోర్టబుల్ ఎలక్ట్రిక్ దోమల ట్రాప్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను క్యాబినెట్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

 బహ్రెయిన్‌లో దోమకాటు సాధారణమే అయినప్పటికీ, అవి దురద, వాపు, నొప్పి మరియు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. నిలిచి ఉన్న నీటిని తొలగించడం, మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్వహించడం, పాత్రలకు మూతలు పెట్టడం మరియు దోమ నివారకాలను ఉపయోగించడం ద్వారా నివారణ ఇంట్లోనే ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com