జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- May 31, 2026
కువైట్: జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై కువైట్ నిషేధం విధించింది. ఆగస్టు 31 వరకు కువైట్‌లోని అన్ని రహదారులపై ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు డెలివరీ మోటార్‌సైకిళ్ల కార్యకలాపాలను నిషేధించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ట్రాఫిక్ మరియు కార్యకలాపాల వ్యవహారాల విభాగం ప్రకటించాయి.
తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు కఠినమైన వాతావరణ పరిస్థితుల నుండి కార్మికులను రక్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. మధ్యాహ్నం బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. చట్టాలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయడంతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కార్మికుల భద్రత నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కంపెనీలు మరియు వ్యాపార యజమానులు పూర్తిగా అమలు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి









