నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- May 31, 2026
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో లైసెన్స్ లేకండా ఆర్థోడాంటిక్ సేవలను అందిస్తున్న ఒక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీపీఏ) సీజ్ చేసింది. ఇది వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తోందని ఆరోగ్య సేవల జనరల్ డైరెక్టరేట్‌కు సమాచారం అందడంతో అధికారులు సదరు కేంద్రంపై దాడులు చేశారు.
ఒక సాధారణ డెంటల్ డాక్టర్ ఎటువంటి సర్టిఫికేట్ లేకుండానే ప్రత్యేక వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రం అధికారిక పని వేళల తర్వాత మరియు ప్రభుత్వ సెలవు దినాలలో అనధికారికంగా ఆర్థోడాంటిక్ సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు క్లయింట్ పేరిట స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించారు. ఆర్థోడాంటిక్ బ్రేస్‌లను అమరుస్తున్న డెంటల్ డాక్టర్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి









