సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- June 01, 2026
అమరావతి: సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా తేళ్ల కస్తూరి సోమవారం (జూన్ 1 న) స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పూర్వపు సెక్రెటరీ మణిరామ్ రిటైర్మెంట్ కారణంగా ప్రస్థుతం జోన్ 3 జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న తేళ్ల కస్తూరి కి 'సెక్రెటరీ' గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తరువుల ను అనుసరించి సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా అకాడమీ మేనేజర్ ఎం.భాస్కర నారాయణ అకాడమీలో అమలవుతోన్న పలు కార్యక్రమాలను సెక్రెటరీ తేళ్ల కస్తూరి కి వివరించారు. ఈ సందర్భంగా పూర్వపు మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పలువురు పాత్రికేయులు సెక్రెటరీ కస్తూరి బాయి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం









