షేక్‌ అమీర్‌ ఆలీని అరెస్టు చేసిన కర్నాటక సీఐడీ పోలీసులు

- August 09, 2016 , by Maagulf
షేక్‌ అమీర్‌ ఆలీని అరెస్టు చేసిన కర్నాటక సీఐడీ పోలీసులు

నల్గొండలో దీనదార్‌ అంజుమన్ సంస్థకు చెందిన ఉగ్రవాది షేక్‌ అమీర్‌ ఆలీని కర్నాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 ఏడాదిలో గుల్బర్గ ప్రాంతంలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ఆలీ ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కొద్ది రోజులుగా నల్గొండలో తిరుగుతున్నాడని పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్‌, కర్నాటక సీఐడీ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్ నిర్వహించి నొల్గొండలోని ఆలీ తన బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. హుబ్లీ, జేజేనగర్‌, వాడి, గోవాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఆలీ నిందితుడు. ఆలీని హుబ్లీకి తరలించే అవకాశం ఉంది. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com