ఆడియో వేడుకకు రంగం సిద్ధం

- August 09, 2016 , by Maagulf
ఆడియో వేడుకకు రంగం సిద్ధం

యంగ్ టైగర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. దీనిని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రోజుకో పోస్టర్ ని విడుదల చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ క్రమంలోనే "జనతా గ్యారేజ్"కు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది.
సమంత వెనుక జూనియర్ ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ వెనుక నిత్యా మీనన్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఉద్దేశం. బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో ఈ ముగ్గురూ పరుగులు పెడుతున్నట్లుగా ఉందని అభిమానులు కీర్తిస్తున్నారు. ఇటీవల కేరళలో చిత్రీకరణ జరిపిన పాట సందర్భంలోనిది ఈ స్టిల్. ఇప్పటివరకు మాస్ ని ఆకట్టుకునే పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్, ఈ పోస్టర్ తో క్లాస్ ని కూడా ఆకర్షించే పనిలో పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com