ప్రయాణికులకు స్పైస్ జెట్ వారి స్వాతంత్య్ర దినోత్సవ కానుక
- August 09, 2016
విమాన ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందిస్తోంది ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. రూ. 399 ప్రారంభ బేస్ ఫెయిర్(ప్రాథమిక ఛార్జీలు)తో దేశీయ విమాన టికెట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 11 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అహ్మదాబాద్-ముంబయి, అమృత్సర్-శ్రీనగర్, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-కొచ్చి, కోయంబత్తూర్-హైదరాబాద్, జమ్ము-శ్రీనగర్, ముంబయి-గోవా తదితర దేశీయ మార్గాలకు ఈ ఆఫర్‌ను అందించనున్నారు. దీని ప్రకారం.. బెంగళూరు-చెన్నైకు రూ. 399 బేస్ ఫెయిర్ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్ ధర రూ. 1,137గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను కేటాయించారన్న విషయాన్ని మాత్రం స్పైస్‌జెట్ వెల్లడించలేదు.
ఇక విదేశీ మార్గాలకు కూడా రూ. 2,999 ప్రారంభ బేస్ ఫెయిర్‌తో ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం.. దుబాయి-దిల్లీ మధ్య బేస్ ఫెయిర్ రూ. 2,999 ప్రాథమిక ఛార్జీ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్ ధర రూ. 8,424గా ఉండనుంది. సాధారణంగా జులై-సెప్టెంబర్ మధ్య విమాన ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సదరు విమానయాన సంస్థలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







