ప్రయాణికులకు స్పైస్ జెట్ వారి స్వాతంత్య్ర దినోత్సవ కానుక

- August 09, 2016 , by Maagulf
ప్రయాణికులకు స్పైస్ జెట్ వారి స్వాతంత్య్ర దినోత్సవ కానుక

విమాన ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందిస్తోంది ప్రముఖ బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌. రూ. 399 ప్రారంభ బేస్‌ ఫెయిర్‌(ప్రాథమిక ఛార్జీలు)తో దేశీయ విమాన టికెట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 11 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
అహ్మదాబాద్‌-ముంబయి, అమృత్‌సర్‌-శ్రీనగర్‌, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-కొచ్చి, కోయంబత్తూర్‌-హైదరాబాద్‌, జమ్ము-శ్రీనగర్‌, ముంబయి-గోవా తదితర దేశీయ మార్గాలకు ఈ ఆఫర్‌ను అందించనున్నారు. దీని ప్రకారం.. బెంగళూరు-చెన్నైకు రూ. 399 బేస్‌ ఫెయిర్‌ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్‌ ధర రూ. 1,137గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లను కేటాయించారన్న విషయాన్ని మాత్రం స్పైస్‌జెట్‌ వెల్లడించలేదు.
ఇక విదేశీ మార్గాలకు కూడా రూ. 2,999 ప్రారంభ బేస్‌ ఫెయిర్‌తో ఆఫర్‌ ప్రకటించింది. దీని ప్రకారం.. దుబాయి-దిల్లీ మధ్య బేస్‌ ఫెయిర్‌ రూ. 2,999 ప్రాథమిక ఛార్జీ అయితే.. అన్ని ఛార్జీలు కలిపి టికెట్‌ ధర రూ. 8,424గా ఉండనుంది. సాధారణంగా జులై-సెప్టెంబర్‌ మధ్య విమాన ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సదరు విమానయాన సంస్థలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com