కట్టుదిట్టమైన భద్రతనడుమ ట్రైన్ లో 5 కోట్లు చోరీ

- August 09, 2016 , by Maagulf

దేశవ్యాప్తంగా ఇదో ఓ సంచలన వార్త. సినిమా తరహాలో పకడ్బందీగా భద్రతా సిబ్బంది మధ్య డబ్బును రైలులో తరలించినప్పటికీ అందులోవున్న రూ. 5 కోట్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ భారీ దోపిడి ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. సేలం ఎక్స్‌ప్రెస్‌ రైలులో తరలిస్తున్న రూ.342 కోట్లలో 5 కోట్లు మాయం కావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంకా లోతుల్లోకి వెళ్తే..
సోమవారం రాత్రి సేలం నుంచి సేలం ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌బీఐకి చెందిన రూ.342 కోట్లతో రైలు బయల్దేరింది. సేలం నుంచి చెన్నైకి మధ్య దూరం 350 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకునే క్రమంలో రైలులోవున్న 342 కోట్లలో ఐదు కోట్లు కనిపించకుండా పోయాయి. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో రెండు బాక్స్‌లు పగిలిపోయి ఉన్నట్లు మంగళవారం ఉదయం నాలుగు గంటల టైమ్‌లో అధికారులు గుర్తించారు. రైలు సుమారు 10 స్టేషన్లలో ఆగిందని, ఆ సమయంలో దోపిడీ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

బోగీ పైభాగంలో వెల్డింగ్‌ మిషన్‌ సాయంతో మనిషి దూరేంత సైజులో దుండగులు రంధ్రం చేశారు. దాని ద్వారా లోనికి దిగి రెండు డబ్బాల్లోని రూ.5 కోట్లు నగదును దోచుకుపోయారు. ఈ నగదు చెన్నైలోని ప్రభుత్వ బ్యాంకులకు ఆర్‌బీఐ అప్పగించాల్సివుంది. ఏసీపీ స్థాయి అధికారి భద్రతతోపాటు ఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ రైలు చెన్నైలోని ఎగ్మోర్ స్టేడియంలోవుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా కరడుగట్టిన నేరస్థుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. నార్మల్‌గా ఆర్‌బీఐ తన నగదు చాలా సీక్రెట్‌గా తరలిస్తుంది. పైగా పటిష్ట భద్రత మధ్య డబ్బును తరలిస్తున్న సమాచారం దుండగులకు ఎలా తెలిసిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com