సల్లూ భాయ్ కి తల్లిగా శ్రీదేవి
- August 09, 2016
అలనాటి అందాల నటి, బాలీవుడ్ నటి శ్రీదేవి చాలాకాలం తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ మూవీతో మళ్లీ తెరపై తళుక్కుమన్న సంగతి తెలిసిందే. 'ఇంగ్లిష్ వింగ్లిష్' తర్వాత శ్రీదేవి మళ్లీ బిజీగా మారిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్‌ను తప్ప జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె రీ ఎంట్రీ అంతగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ నటించిన పులి సినిమాలో రాజమాతగా నటించింది. అయితే ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోకపోయింది. సినిమా డిజాస్టర్ అనిపించుకోవడంతోపాటు రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతను శ్రీదేవి ఇబ్బంది పెట్టిందనే ప్రచారం ఆమెకు కొత్త ఆఫర్లు రాకుండా చేశాయి. రీఎంట్రీలో ఆమె మ్యాజిక్ పనిచేయకపోవడంతో శ్రీదేవికి ఆఫర్లు ఇచ్చేందుకు దక్షిణాదిలో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రావడం లేదు. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీదేవి కోసం ఓ కొత్త కథ తయారైందని ఇండ్రస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా దర్శక నిర్మాత ఒకరు తల్లీ కొడుకు సెంటిమెంట్‌తో సిద్ధం చేసిన కథను సల్లూభాయ్‌కి వివరించాడు. ఆయన సై అనడంతో తల్లి పాత్రకు శ్రీదేవిని తీసుకోవాలని నిర్ణయించారట. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు శ్రీదేవిని కలవకపోయినా 'సుల్తాన్' కోరితే 'అతిలోకసుందరి' కాదంటుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆమెకు ఎంతోకొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉంటుందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







