40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?

- June 04, 2026 , by Maagulf
40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?

రియాద్: సౌదీ అరేబియా ఏడాది పొడవునా విభిన్న రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. సుదీర్ఘమైన చలిగాలులు మరియు అక్కడక్కడా కురిసే భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అయితే, 1985 నుండి 2025 వరకు జూన్ నెలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా వాతావరణ సరళిని 'నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ' (NCM) పర్యవేక్షించింది. సౌదీ అరేబియా తన అత్యంత డ్రయేస్ట్ మరియు హాటేస్ట్ హీట్ నెలల్లో ఒకదానిని సమీపిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.

గత జూన్ నెల వాతావరణంపై NCM చేసిన విశ్లేషణ ప్రకారం.. 1991–2020 మధ్య  వాతావరణ ప్రామాణిక (climate baseline) గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే..  నెలలో సగటు ఉష్ణోగ్రత 32.2°C గానూ, సగటు వర్షపాతం 1.58 మి.మీ గానూ నమోదైంది.  ఈ గణాంకాల ప్రకారం, సౌదీ లో జూన్ నెల మూడవ అత్యంత వేడి నెలగానూ, సంవత్సరంలోనే అత్యంత డ్రయేస్ట్ నెలగానూ నిలువనుంది.

NCM రికార్డుల ప్రకారం, జూన్ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.5°C వరకు చేరుకున్నాయి.  అదే సమయంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 24.38°C గా నమోదైంది.  ఇక 1985 నుండి 2025 మధ్య కాలంలో అత్యధిక సగటు గరిష్ట ఉష్ణోగ్రత 2024లోనే నమోదైంది.  ఇది 41.52°C గా ఉంది. దీనికి భిన్నంగా 1985లో ఈ నెలలో అత్యల్ప సగటు కనిష్ట ఉష్ణోగ్రత 22.14°C గా నమోదైంది.

అయితే, ఇటీవలి సంవత్సరాల్లో జూన్ నెల వాతావరణం నిలకడగా కొనసాగుతోందని కూడా తెలిపింది. గత దశాబ్ద కాలంలో నమోదైన గణంకాలను పరిశీలిస్తే.. 2024లో అత్యధిక సగటు కనిష్ట ఉష్ణోగ్రత 27.04°C గా నమోదైంది.

గత దశాబ్దంలో.. 2019లో అత్యధిక జూన్ వర్షపాతం సగటు 4.0 మి.మీ.గా నమోదు కాగా, 2025లో అత్యల్పంగా కేవలం 0.02 మి.మీ.గా నమోదైంది.  ఇక భౌగోళికంగా, జూన్ నెలలో ఉష్ణోగ్రతలు పశ్చిమ సౌదీ అరేబియా మరియు తూర్పు, దక్షిణ ప్రాంతాలలోని కొన్ని భాగాలలో అత్యధికంగా ఉంటాయి. అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణంగా నైరుతి పర్వత ప్రాంతాలు మరియు రాజ్యం ఉత్తర భాగాలలో నమోదవుతాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల పరంగా చూస్తే.. జూన్ నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 2010 జూన్ 22న జెడ్డాలో 52°Cగా ఉంది. ఈ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 1990 జూన్ 4న అల్-ఖురయ్యత్‌లో 10.6°Cగా ఉంది. జూన్ నెలలో నమోదైన అత్యధిక రోజువారీ వర్షపాతం 1996 జూన్ 16న షరూరాలో 53.8 మి.మీ.గా ఉంది. ఈ నెలలో నమోదైన అత్యంత బలమైన గాలి వేగం 2023 జూన్ 14న తైఫ్‌లో గంటకు 111.1 కి.మీ.గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com