భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- June 04, 2026
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్‌లోని సెంట్రల్ మార్చురీని సందర్శించారు. అలాగే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన భారత జాతీయుడి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ అల్-అవాధిని కలిసి చర్చించారు.
ఈ దాడిలో గాయపడి, ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న భారత జాతీయులను కూడా రాయబారి త్రిపాఠి పరామర్శించారు. ఆమె గాయపడిన వారితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాయబార కార్యాలయం తరఫున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని త్వరితగతిన భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







