సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- June 04, 2026
యూఏఈ: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో దుబాయ్ నివాసి గౌరవ్ మదాన్ అనే భారతీయుడు 1 మిలియన్ డాలర్లు (3.67 మిలియన్ దిర్హమ్స్) గెలుచుకున్నాడు. సరిగ్గా 15 నిమిషాల ముందు, గౌరవ్ మదాన్ తన యజమాని నుండి అడ్వాన్స్ కోరుతూ ఒక ఈమెయిల్‌ను సిద్ధం చేస్తున్నాడు. లీగల్ కౌన్సెల్ మరియు కంప్లయన్స్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న ఈ భారత జాతీయుడు.. తాను ఇటీవల దుబాయ్‌లో బుక్ చేసుకున్న 2.4 మిలియన్ దిర్హమ్స్ విలువైన ఇంటి కొనుగోలుకు ఆర్థిక సహాయం కోసం ఈ డబ్బు అవసరమని చెప్పాడు.
తాను ఇల్లు బుక్ చేసుకుని, లెక్కలు వేసుకుంటున్నట్టు చెప్పారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకుల నుంచి కాల్ రావడానికి కేవలం 15 నిమిషాల ముందు, తన ఆఫీస్ నుండి అడ్వాన్స్ కోరుతూ ఒక ఈమెయిల్ టైప్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ విజయం తన తలుపు తట్టిందని గౌరవ్ సంతోషం వ్యక్తం చేశారు. అతను జూలై 2023లో తన భార్య, తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి యూఏఈకి వలస వచ్చాడు.
ఇక గెలుచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి, మరికొంతను దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు గౌరవ్ చెప్పారు.
తనను విజేతగా నిలిపిన టిక్కెట్‌ను మే నెల మూడవ వారంలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇది తనకు 41వ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టిక్కెట్ అని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ టిక్కెట్ నంబర్లను 'ఐ యామ్ ఫీలింగ్ లక్కీ' ఆప్షన్‌ను ఉపయోగించి కొన్నట్లు తెలిపారు. జీవితాన్ని మార్చే విజయం సాధించినప్పటికీ, తన ఉద్యోగాన్ని వదిలిపెట్టే ఆలోచన లేదని గౌరవ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







