అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!

- June 04, 2026 , by Maagulf
అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!

మస్కట్: అల్ జజర్‌లోని అల్ వుస్తా గవర్నరేట్‌లో ఉన్న వినియోగదారుల పరిరక్షణ విభాగం, అల్ వుస్తా మునిసిపాలిటీ అధికారులతో కలిసి అల్ జజర్‌లోని అనేక వాణిజ్య సంస్థలలో సంయుక్త తనిఖీలను నిర్వహించింది.  వినియోగదారుల హక్కులు, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు మార్కెట్లు నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు.

అలాగే, నిత్యావసర వస్తువుల లభ్యతను మరియు వాటి ధరల స్థిరత్వాన్ని ధృవీకరించడంతో పాటు వినియోగదారుల హక్కులను పరిరక్షించే సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని నిర్ధారించడం మరియు మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం తనిఖీల లక్ష్యమన్నారు.

ఈ  సందర్భంగా, ఆమోదించబడిన ప్రామాణిక నిర్దేశాలకు అనుగుణంగా లేని అనేక పురుగుమందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com