దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- June 04, 2026
దోహా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతర్ రాజధాని దోహాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ICC) వేదికగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఖతర్‌లోని తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు ఐసీసీ సాంస్కృతిక కార్యక్రమాల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఖతర్‌లో తెలుగు ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి, కార్మికుల సంక్షేమం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది. భారత రాయబార కార్యాలయం, ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) మరియు ఇతర సంక్షేమ సంస్థలతో సమన్వయంగా పనిచేస్తూ సమాజ సేవలో ముందంజలో కొనసాగుతోంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు, ప్రధాన కార్యదర్శి సంధ్య వినయ్ నాయకత్వం వహించారు.కార్యవర్గ సభ్యులు భవాని, సాగర్, రాజేశ్వర్, గడ్డి రాజు, శంకర్ గౌడ్, ఎల్లయ్య తాళ్లపల్లి విశేషంగా కృషి చేశారు.
అలాగే యువజన విభాగ సభ్యులు ముకుందం, రాజేష్, ప్రవీణ్, అరుణ్, ప్రసాద్, సుధాకర్, బొల్లె రాజ, గంగారం, దీపక్, మధుతో పాటు తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేశారు.
వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన హరీష్ రెడ్డి, సాగర్, రాథోడ్లకు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వారి సహకారం కార్యక్రమ విజయానికి ఎంతో దోహదపడిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులు, ప్రేక్షకులు, స్వచ్ఛంద సేవకులు, దాతలు మరియు ప్రత్యక్ష, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ గల్ఫ్ సమితి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.
భవిష్యత్తులో మరిన్ని సేవా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ తెలుగు వారి సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తామని తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు తెలిపారు.
“సేవే మా ధ్యేయం...తెలుగు వారి సంక్షేమమే మా లక్ష్యం...” అంటూ తెలంగాణ గల్ఫ్ సమితి తన సంకల్పాన్ని మరోసారి వెల్లడించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









