సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- June 05, 2026
లండన్: సౌదీ విద్యార్థి మహమ్మద్ అల్-ఖస్సిం హత్య కేసులో ప్రధాన నిందితుడైన చాజ్ కొరిగాన్కు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ హత్య సమయంలో నిందితుడు మాదకద్రవ్యాలు, మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారించారు. పెరోల్‌కు అర్హత సాధించడానికి కనీసం 22 సంవత్సరాల ఆరు నెలల పాటు జైలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.
2025 ఆగస్టులో కేంబ్రిడ్జ్‌లోని విద్యార్థుల హాస్టల్ వెలుపల అల్-ఖస్సిమ్ను మెడపై కత్తితో పొడిచి చంపారు. కేంబ్రిడ్జ్‌లోని హోల్‌బ్రూక్ రోడ్‌కు చెందిన నిర్మాణ కార్మికుడు చాజ్ కొరిగన్, డ్రగ్స్ మత్తులో వంటగది కత్తితో అల్-ఖస్సిమ్పై దాడి చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అలాగే, నేరస్థుడికి సహాయం చేసిన కొరిగన్ తండ్రి, 50 ఏళ్ల పీటర్ కొరిగన్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాడి సమయంలో తన కుమారుడు ధరించిన డ్రెస్ ను అతను దాచిపెట్టాడని కోర్టు తెలిపింది. ఈ విచారణ సమయంలో అల్-ఖస్సిమ్ తండ్రి యూసెఫ్ అల్-ఖస్సిమ్ మరియు సోదరి షాతా అల్-ఖస్సిమ్ లు కోర్టులోనే ఉన్నారు.
యునైటెడ్ కింగ్డమ్ మరియు సౌదీ అరేబియా లో హై అలెర్ట్ క్రియేట్ చేసిన ఈ హత్య కేసుకు సంబంధించి నెలల తరబడి దర్యాప్తులు మరియు విచారణలు జరిగాయి. చివరకు నింతితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో కేసుకు ముగింపు పడింది. సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన 20 ఏళ్ల అల్-ఖస్సిం, కేంబ్రిడ్జ్‌లో 10 వారాల స్టడీ అసైన్‌మెంట్‌పై ఉన్న సమయంలో హత్యకు గురయ్యాడు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







