కార్మికుల సమస్యలపై స్పందించిన సౌదీ కింగ్
- August 09, 2016
భారతీయులు సహా పలు దేశాలకు చెందిన వలస కార్మికులు పడ్తున్న వెతల నుంచి ఉపశమనం కల్పించేందుకు సౌదీ కింగ్ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుని, వాటిని అమల్లోకి తీసుకురావాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల్ని ఆదుకునేందుకుగాను 100 మిలియన్ సౌదీ రియాల్స్ (26 మిలియన్ డాలర్లు) కేటాయించారు సౌదీ కింగ్. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, వాటి ప్రభావం కారణంగా సౌదీలో కన్స్ట్రక్షన్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల్ని తొలగించడంతో సమస్య తీవ్రమైంది. తీవ్రమైన వెతలను అనుభవిస్తున్న తమ దేశ కార్మికుల కోసం భారతదేశం నుంచి సౌదీ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. అలాగే వారిని ఆదుకునేందుకోసం ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని చర్యలు చేపట్టింది. వీటిల్లో ఆహారం అందించడం, స్వదేశానికి వచ్చేందుకు ఆర్థిక సహాయం, అలాగే పాస్‌పోర్ట్ క్లియరెన్స్ వంటివాటిల్లో సహాయం చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించింది భారత ప్రభుత్వం. భారత విజ్ఞప్తిని అలాగే, ఇతర దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిశీలించిన సౌదీ కింగ్, కార్మికులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









