హైదరాబాద్‌లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- June 05, 2026
హైదరాబాద్: స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేసేందుకు మల్కాజిగిరి పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లపై ఏకంగా 500 మంది పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడి చేశారు. దీంతో స్పా సెంటర్ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. కస్టమర్ల డేటా రిజిస్టర్‌ను మెయింటైన్ చేయడం లేదని వెల్లడైంది. ఈ సందర్భంగా స్పా సెంటర్లు నిర్వహిస్తున్న ఇళ్ల ఓనర్లను కూడా పోలీసులు విచారణ జరిపారు.
మల్కాజిగిరి సీపీ సుమతి .. తన పనితీరుతో సర్వత్రా ప్రశంసలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మహిళల భద్రతను స్వయంగా పర్యవేక్షించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో సివిల్ డ్రెస్‌లో రాత్రి పూట గస్తీ కాసిన సీపీ సుమతి .. తాజాగా మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది పోలీసులు.. శుక్రవారం రోజున ఏకకాలంలో ఏకంగా 113 స్పా సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. స్పా సెంటర్ల పేరుతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లలో అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. అక్కడికి వచ్చే కస్టమర్ల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను కూడా స్పా సెంటర్ నిర్వాహకులు సరిగ్గా రికార్డు చేయడం లేదని పోలీసుల విచారణలో గుర్తించారు. అదే సమయంలో స్పా సెంటర్లకు ఇళ్లను అద్దెకు ఇస్తున్న ఓనర్లను కూడా పోలీసులు విచారణ జరిపారు. స్పా సెంటర్ల ఓనర్లు ఇచ్చే అద్దెను తీసుకోవడం తప్ప.. అక్కడ ఏం జరుగుతుంది అని కూడా యజమానులు పట్టించుకోవడం లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలోనే ఈ తనిఖీల్లో చాలా స్పా సెంటర్లలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. వీటిపై ఆ స్పా సెంటర్లకు అద్దెకు ఇచ్చిన ఇంటి ఓనర్లు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదని పోలీసులు తేల్చారు. హైదరాబాద్ నగరంలో భారీగా ఉన్న స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని నిత్యం పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీంతో ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న మల్కాజిగిరి పోలీసులు.. ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయా స్పా సెంటర్ల పై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకేసారి భారీగా స్పా సెంటర్లపై పోలీసులు ఒకేసారి దాడులు చేయడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే స్పా సెంటర్ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని..నగరవాసులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయొచ్చని పోలీసులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి సీపీ సుమతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









