పొటాషియంది కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర
- August 09, 2016
ఏం తినాలన్నా ముందుగా మనసులో తలెత్తే ప్రశ్న.. ఇది కొవ్వుని కానీ పెంచుతుందా? అని. ప్రతి ఆహారం ఆ కోవలోకే రాదు. కొన్ని పదార్థాలు కొవ్వుని కరిగిస్తాయి కూడా. అవేంటో చూద్దాం.
తా జా పండ్లూ, కాయగూరల్లో ఉండే పొటాషియంది కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర. వీటిని తిన్నప్పుడు అవి నిదానంగా జీర్ణమవుతాయి. శక్తిని కూడా ఒక్కసారిగా కాకుండా నిదానంగా విడుదల చేస్తాయి. అదే పొటాషియం ప్రత్యేకత. ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా ఉంటాయి.
*
వర్షం పడుతున్నప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కజొన్న పేలాలు తినడానికి ఆసక్తి చూపిస్తాం కదా! వాటికి ఉండే అదనపు ప్రయోజనం కొవ్వుని అదుపులో ఉంచడం. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లూ, పీచు సమృద్ధిగా ఉంటాయి. దీనికి వెన్న, ఇతరత్రా పదార్థాలు కలపకుండా కాస్తంత ఉప్పు మాత్రమే చేర్చి తీసుకుంటేనే ఆ లాభాలు పొందవచ్చు.
*
గ్లైసమిక్ స్థాయిలు తక్కువగా ఉండే ముడిబియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటూ వాటిల్లోని పీచూ, సెలీనియం వంటివి ఆకలిని అదుపులో ఉంచుతాయి. దాంతో శరీరంలో కొవ్వు త్వరగా పేరుకోదు. కొలెస్ట్రాల్, బీపీ సమస్యలూ అదుపులో ఉంటాయి.
*
పప్పు ధాన్యాలూ, వివిధ రకాల తృణధాన్యాలూ పీచుని పుష్కలంగా అందించి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. ఎప్పుడూ ఒకేరకం కాకుండా కొత్తరకాల తృణధాన్యాలని ప్రయత్నించాలనుకున్నప్పుడు వాటితో జావల్లాంటివి చేసుకోండి. ఫలితాలు బాగుంటాయి.
*
కొవ్వు అధికంగా ఉండే పాల మీగడను ఉపయోగించాల్సిన వంటకాల్లో ప్రత్యామ్నాయంగా కమ్మని పెరుగుని వాడితే పోషకాలు అంది కొవ్వు సమస్య ప్రసక్తే ఉండదు. పచ్చిమిర్చిని కూరల్లో వాడితే దానిలోని ప్రత్యేక గుణాలు కెలొరీలని కరిగించేస్తాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









