ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- June 06, 2026
మస్కట్: గల్ఫ్ సహకార మండలి దేశాల ఏకీకృత కస్టమ్స్ చట్టంలోని ఆర్టికల్ 44కు అనుగుణంగా, అన్ని దిగుమతి వస్తువులకు ప్యాలెట్ల వినియోగాన్ని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించాయి. గూడ్స్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జూలై 15 నుండి ల్యాండ్ బార్డర్స్ ద్వారా వచ్చే గూడ్స్ కు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుండి వాయు మరియు సముద్ర దిగుమతులకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
ఉడ్, ప్లాస్టిక్ లేదా మెటల్ ప్యాలెట్లను ఉపయోగించి రవాణా మరియు నిర్వహణ అవసరమయ్యే వస్తువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే, బల్క్ మెటీరియల్స్, భారీ పరికరాలు, పైపులు, రోల్స్, మరియు పాలరాయి లేదా రాతి దిమ్మెల వంటి ప్యాలెట్లపై ఉంచలేని వస్తువులకు మినహాయింపులు ఇచ్చారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఏ డూడ్స్ ను అవి వచ్చిన దేశానికి తిరిగి పంపబడతాయని పేర్కొన్నది. వ్యాపారులు మరియు భాగస్వాములందరూ ఈ కొత్త మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ కోరింది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







