భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- June 06, 2026
అమ్మాన్: కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసెఫ్ సౌద్ అల్-సబా అమ్మాన్‌లో జోర్డాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మాజెన్ అల్-ఫరాయాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతా పరిణామాలపై చర్చలు జరిపారు.
ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు మంత్రులు కువైట్ -జోర్డాన్ మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలను, అలాగే వారి వారి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారని తెలిపింది. అలాగే, ప్రాంతీయ భద్రతా సవాళ్లు మరియు వాటిని పరిష్కరించే ప్రయత్నాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మరోవైపు, కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అల్-షురైయాన్, జోర్డాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, మేజర్ జనరల్ యూసెఫ్ అల్-హునైతి కీల సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సైనిక, రక్షణ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







