ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- June 06, 2026
యూఏఈ: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యూఏఈ అధికారులు కొత్త ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించారు. ఎబోలా ప్రభావిత మూడు దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్‌లకు చెందిన పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపివేశారు.
జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తుల నిర్వహణ అథారిటీ (NCEMA) మరియు ఐడెంటిటీ, సిటిజన్షిష్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ ఫెడలర్ అథారిటీ (ICP) ఈ అదనపు ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించాయి. వీసా సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
జాబితాలో ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల మీదుగా ట్రాన్సిట్ ద్వారా ప్రయాణించే వారికి కూడా యూఏఈలోకి ప్రవేశం పరిమితం చేయబడుతుందని స్పష్టం చేసింది. యూఏఈకి రాకముందు, జాబితాలో ఉన్న దేశాల వెలుపల 21 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపిన ప్రయాణికులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. అయితే, కార్గో విమాన సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







