70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- June 06, 2026
మనామా: బహ్రెయిన్ ఆరోగ్య సంరక్షణ రంగానికి సమిష్టిగా 1,000 సంవత్సరాలకు పైగా సేవ చేసిన 70 మంది విశిష్ట నర్సులకు ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఘనంగా సత్కరించింది. ప్లాటినం జూబ్లీ వేడుకలలో భాగంగా ILA ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. బహ్రెయిన్ లో 25 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలను అందించిన వారిని గౌరవిస్తూ “నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ – సర్వీస్ అవార్డ్ 2026” ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బహ్రెయిన్ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సెహమ్ బుబ్షైత్ ముఖ్య అతిథిగా, బహ్రెయిన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ అమెర్ అల్-డెరాజీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఆధునిక 'బహ్రెయిన్ నైటింగేల్స్'గా అభివర్ణించారు. విభిన్న నేపథ్యాలు మరియు వర్గాలకు చెందిన నర్సుల సమిష్టి కృషి బహ్రెయిన్ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసిందని వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత ఉపఖండానికి చెందిన నర్సులు పోషించిన మార్గదర్శక పాత్రను వారు కొనియాడారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







