వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- June 07, 2026
కువైట్: వార్ రిలేటెడ్ కంటెంట్ షేరింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని కువైట్ సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిక జారీ చేసింది. యుద్ధాలు, సైనిక చర్యలు, మిస్సైల్స్ లేదా మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు మరియు ఫోటోలను ప్రచురించడం లేదా ప్రచారం చేయడంపై సైబర్ క్రైమ్ విభాగం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
"అన్ని భాషలలో అత్యవసర హెచ్చరిక" అనే టైటిల్ తో తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. వార్ సంబంధిత కంటెంట్‌ను పంచుకోవడం లేదా ప్రచారం చేయడం కువైట్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. నివాసితులందరూ చట్టాలను గౌరవించాలని, ప్రజా శాంతికి భంగం కలిగించే రెచ్చగొట్టే కంటెంట్ కు ఆకర్షితులవవద్దని కోరింది.
సోషల్ మీడియా వేదికలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఉద్రిక్తత లేదా తప్పుడు సమాచార వ్యాప్తికి దోహదపడే ఎలాంటి సమాచారాన్నైనా ప్రచారం చేయకుండా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









