ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- June 07, 2026
మస్కట్: ఒమన్ పౌరులకు ఉచిత పర్యాటక వీసాలను మంజూరు చేయాలని శ్రీలంక (డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక) నిర్ణయించింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) విధానం ద్వారా ఒమన్ పౌరులు శ్రీలంకలో గరిష్టంగా 30 రోజుల పాటు పర్యటించడానికి అనుమతిస్తారు. ఆ అనుమతి కాలపరిమితిలో ప్రయాణికులు శ్రీలంకలోకి రెండుసార్లు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అనుమతించిన గడువు కంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే పర్యాటకులు, వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకుని, తగిన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీలంకకు ప్రయాణించాలనుకునే ఒమన్ పౌరులు, తమ పాస్‌పోర్ట్‌లు శ్రీలంకలో ప్రవేశించే తేదీ నుండి కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, ఆరోగ్య బీమా (health insurance) కవరేజీని కలిగి ఉండాలని ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







