ఐఎస్ఐఎస్ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి
- July 25, 2015
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల (ఐఎస్ఐఎస్) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ప్రజల మీద ప్రతాపం చూపిస్తున్నారు. స్థానికులను చిత్రహింసలకు గురి చేసి పలు రకాలుగా చంపేస్తున్నారు. ఇటివల సిరియాలో ఇద్దరు యువకులు స్వలింగ సంపర్కులు అనే అనుమానంతో దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని పెద్ద భవనం మీదకు తీసుకు వెళ్లి చేతులు వెనక్కి కట్టేశారు. తరువాత తాళ్లతో కాళ్లు కట్టి పై నుండి కిందకు తోసేశారు. తల పగిలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిద్దరిని రాళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వారిద్దరిని ఎలా హత్య చేశారు అనే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. బహిరంగ శిక్షల వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చెయ్యరాదని ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ బాగ్దాది ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులకే ఉగ్రవాదులు వారు చేస్తున్న అరాచకాల వీడియోలను విడుదల చేశారు.గతంలో స్వలింగ సంపర్కులు అనే అనుమానంతో పలువురిని దారుణంగా హత్య చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







