మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్‌మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

- June 08, 2026 , by Maagulf
మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్‌మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

మాస్కో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మాస్కో వేదికగా ఆయన ఒక కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ (విశిష్ట ఖనిజాల) పరిశోధన సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఉన్న అనుకూలతలు, అవకాశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

విశాఖ, శ్రీకాకుళంలో రిఫైనింగ్ హబ్..
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో లభించే అపారమైన భారీ ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ (REE) రిఫైనింగ్ హబ్’ను ఏర్పాటు చేయాల్సిందిగా రష్యా సంస్థను కోరారు.

దీనితో పాటు, భారతదేశంలో రోజురోజుకూ పుంజుకుంటున్న ఎలక్ట్రిక్ వాహనాలు (EV), విండ్ ఎనర్జీ (పవన విద్యుత్) రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లాలో ఒక భారీ ప్రాజెక్టును ప్రతిపాదించారు. గిరెడ్‌మెట్ సంస్థ అధునాతన సాంకేతిక భాగస్వామ్యంతో నెల్లూరులో ‘నియోడైమియం మాగ్నెట్’ (Neodymium Magnet) ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com